నక్కలబండ తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సహకారంతో గిరిజన కుటుంబాలకు సొంతింటి కల సాకారం
జడ్చర్ల, నవంబర్ 16: జడ్చర్ల మున్సిపాలిటీ(Jadcherla Municipality) పరిధిలోని 9వ వార్డు నక్కలబండ తండాలో లావుడియా శంకర్–దేవి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ గిరీష్, స్థానిక మాజీ కౌన్సిలర్ చైతన్య చౌహన్ హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కమలం శేఖర్, నీలవేణి, అంజాద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంగలి ప్రశాంత్, హరి రామ్, పవన్, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సహకారంతో నక్కలబండ తండాలో ఇప్పటివరకు 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.
9వ వార్డుకు మొత్తం 33 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వాటిలో సుమారు 20 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ బిల్లులు కూడా అందాయని తెలిపారు.