పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

16-11-2026 | 08:05pm

కాగజ్ నగర్, (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(MLA Harish Babu), ఎమ్మెల్సీ దండే విటల్ లు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం చేయూత పథకం కింద 468 మంది లబ్దారులకు పెన్షన్లను మంజూరు చేసింది. దీంతో లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పెన్షన్ ధృవపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కోట ప్రసాద్, ఎం పి ఓ వినోద్, సిర్పూర్ టి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వడ్డేటి నానయ్య, పెన్షన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు