జాతీయ అడ్వెంచర్ క్యాంపునకు శాతవాహన టీం
ముకరంపుర, నవంబర్ 16(విజయ క్రాంతి) శాతవాహన విశ్వవిద్యాలయ(Satavahana University) జాతీయ సేవా పథకం(National Service Scheme) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అడ్వెంచర్ క్యాంపులో పాల్గొనేందుకు డా. కాంపెల్లి అర్జున్ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు బయలుదేరింది. ఈనెల18 నుంచి 27 వరకు పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ నేషనల్ అడ్వెంచర్ క్యాంపులో విశ్వవిద్యాలయ బృందం పాల్గొననుంది.
ఈ సందర్భంగా బృందానికి శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్, జాతీయ స్థాయి అడ్వెంచర్ క్యాంపులో పాల్గొనడం విద్యార్థులకు మంచి అవకాశమని, ఈ అనుభవం వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తుందని ఆకాంక్షించారు.