గిరిజన రైతుల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

16-11-2026 | 07:10pm

జిల్లా అదనపు కలెక్టర్ కు సర్పంచ్ ధరావత్ సుభాష్ నాయక్ వినతి

చేగుంట నవంబర్ 16,విజయక్రాంతి: చేగుంట మండలం గొల్లపల్లి గ్రామ(Gollapalli village) శివారులోని జైత్రం తండా పరిధిలో గిరిజన రైతుల భూముల(Lands of tribal farmers) సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ ధరావత్ సుభాష్ నాయక్ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్వే నంబర్ల వారీగా భూ రికార్డులు, పాత పహాణీలు, భూభారతి వివరాలు, క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి విచారణ చేపట్టాలని కోరారు.

రెవెన్యూ రికార్డుల్లో ఒకరి పేరు ఉండి , మరొకరు సాగులో ఉన్న భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. దళారుల మోసాల వల్ల గిరిజన రైతులు నష్టపోకుండా, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లను విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. భూ రీసర్వే నిర్వహించి, తరతరాలుగా భూములను సాగు చేసుకుంటున్న అసలైన గిరిజన రైతులకు న్యాయం చేసి శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు