దేశ పోలీసు.. వ్యవస్థలో పోలీస్ బ్యాండ్లకు విశిష్టమైన గుర్తింపు

16-11-2026 | 07:25pm

క్రమశిక్షణ గుర్తింపు .. ప్రతీకలుగా పోలీస్ బ్యాండ్లు నిలుస్తాయి.                        

ఘనంగా 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం.               

ముఖ్యఅతిథిగా తెలంగాణ డిజిపి సివి ఆనంద్.                             

జవహర్ నగర్, నవంబర్ 16 (విజయక్రాంతి): దేశ పోలీసు వ్యవస్థలో పోలీస్ బ్యాండ్లకు విశిష్టమైన సాంప్రదాయం గుర్తింపు ఉన్నాయని... క్రమశిక్షణ గుర్తింపు గౌరవం ఐక్యతకు.... ప్రతీకలుగా పోలీసు బ్యాండ్లు నిలుస్తాయని తెలంగాణ డిజిపి సీవీ ఆనంద్(DGP CV Anand) పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని సిఆర్ పిఎఫ్ గ్రూప్ సెంటర్లో 27వ అఖిలభారత పోలీస్ బ్యాండ్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఆల్ ఇండియా పోలీస్ ఫోర్స్ కంట్రోల్ బోర్డు న్యూఢిల్లీ ఆధ్వర్యంలో సి ఆర్ పి ఎఫ్ ఈ జాతీయ స్థాయి పోటీలను ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు పోలీసు విభాగాలు పోలీసు బలగాలకు చెందిన 25 కు పైగా బ్యాండ్లు పాల్గొంటున్నాయి. దాదాపుగా 1500 మంది బ్యాండ్ సిబ్బంది తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ డిజిపి సివి ఆనంద్ సోమవారం హాజరై పోటీలను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ పోలీసు బ్యాండ్లకు దేశ పోలీసు వ్యవస్థలో విశిష్టమైన సాంప్రదాయం గుర్తింపు ఉన్నాయన్నారు. పోలీసు బ్యాండ్లు కేవలం సంగీత ప్రదర్శన కే కాకుండా క్రమశిక్షణ సంస్థ గత గుర్తింపు గౌరవం ఐక్యతలకు ప్రతీకలుగా నిలుస్తాయి అన్నారు. జాతీయ వేడుకలు అధికారిక కవాతులు గౌరవ వందనాలు పోలీసుస్మారక దినోత్సవాలు తదితర ముఖ్యమైన కార్యక్రమాల్లో పోలీసు బ్యాండ్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. సంగీతానికి భాష ప్రాంతీయ సాంస్కృతిక భేదాలు ఉండవని ప్రజలకు పోలీసులకు మధ్య అనుబంధాన్ని పెంపొందించడంలో సంగీతం శక్తివంతమైన సాధనమన్నారు.

పోలీస్ బ్యాండ్ సభ్యులు నిరంతరం కఠిన సాధన చేస్తూ సంగీత నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ ప్రదర్శించడం అభినందనీయమన్నారు. భారత పోలీసు వ్యవస్థలో బ్యాండ్లకు ప్రత్యేక స్థానం ఉందని వాటి సంగీత ప్రదర్శనలు కబాతుల్లో సమన్వయాన్ని సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని బృందస్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు.

1999లో మొట్టమొదటి అఖిలభారత పోలీస్ బ్యాండ్ పోటీలకు సిఆర్పిఎఫ్ అతిథ్యం ఇచ్చిందని అప్పటినుండి ఈ పోటీలు దేశవ్యాప్తంగా పోలీసు కేంద్ర సాయిధ బలగాల సిబ్బందిలో సంగీత ప్రతిభను గుర్తించే ప్రతిష్టాత్మక వేదికగా అభివృద్ధి చెందాయని తెలిపారు. 2023 నుండి మహిళా పోలీస్ సిబ్బంది బ్యాండ్ బృందాలలో ఎక్కువగా పాల్గొనడం దేశ పోలీసు వ్యవస్థలో సమానత్వం ప్రగతిశీల దృక్పథానికి నిదర్శనం అన్నారు. ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా సంయుక్త కవాతు  నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాలు కేంద్ర బలగాలకు చెందిన బ్యాండ్ సభ్యులు ఒకే బృందంగా కలిసి సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు.                       

ప్రజల కోసం ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శన.                                 

ప్రజలకు పోలీసు బ్యాండ్ల సంగీత సాంప్రదాయాలకు పరిచయం చేసేందుకు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. నవంబర్ 17 సాయంత్రం ఐదున్నర గంటలకు హైదరాబాదులోని హైటెక్స్ శిల్పారామం వద్ద ప్రముఖ సంగీత దర్శకుడు అను సమక్షంలో ప్రదర్శన నిర్వహిస్తారు. నవంబర్ 18 సాయంత్రం ఐదున్నర గంటలకు హైదరాబాద్ లో మినీ పార్కులో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సమక్షంలో ప్రత్యేక బాండ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా హైదరాబాద్ ప్రజలు పర్యాటకులు పోలీసు కేంద్ర సాయిధ బలగాల బ్యాండ్ల అద్భుతమైన సంగీత ప్రదర్శనలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కల్పించనున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ పోటీలు సంగీతం క్రమశిక్షణ సాంప్రదాయాలు జాతీయ సమైక్యతకు ప్రతీక గా నిలవనున్నాయని సిఆర్పిఎఫ్ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు