ముగిసిన భారత్ సమ్మిట్
- పలు కీలక అంశాలపై చర్చ
- 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధుల హాజరు
- చివరి రోజు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
నవంబర్ 14 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం(State Government) నిర్వహించిన భారత్ సమ్మిట్ ముగిసింది. 70 దేశాల నుంచి వెయ్యి మంది వరకు ప్రతినిధులు హాజరయ్యారు. చివరి రోజు సదస్సు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ(Senior Congress leader Rahul Gandhi) హాజరయ్యారు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక , సామాజిక పరిణామాలపై చర్చించారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి నాలుగు కీలక ప్యానల్ చర్చలు జరిగా యి.
పట్టణీకరణ, ప్యూచర్ సిటీ, ఆర్థిక న్యా యం, సామాజిక న్యాయం, సంక్షేమ విధానాలపై దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రము ఖులు, నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రెండో రోజు కూడా సహకార సమాఖ్యవాదం, సంస్కృతి సమాజ యం, యువత క్రీడలు రాజకీయాలు, ఎన్నికల సమగ్రత వంటి అంశాలపై చర్చ కొనసాగింది. రెండో రోజు రాహుల్‌గాంధీ .. దేశంలోని రాజకీయ అంశాలపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. లాటిన్ అమెరికా, ఆసి యా, ఆఫ్రికా ప్రతినిధులతో రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. రాష్ట్ర నాయకత్వంతో మా ట్లాడిన రాహుల్.. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల పై ఆరా తీసినట్లు తెలిసింది. కాగా, సమ్మిట్ కోసం రాహుల్‌గాంధీ శుక్రవారం ఆర్ధరాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్త మ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు స్వాగతం పలికారు. శనివారం సా యంత్రం సదస్సు ముగిసిన అనంతరం రాహుల్‌గాంధీ తిరిగి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.