గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్
- తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు విదేశీ ప్రతినిధులకు ఆహ్వానం
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవంబర్ 14 (విజయక్రాంతి) : అంతర్జాతీయ అంశాలపై (International issues)పరిశోధ న, విధానపరమైన చర్చలు, ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాల అన్వేషణకు ఒక శక్తిమంతమైన గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేం దుకు భారత్ సమ్మిట్ వేదికగా ఈ సంస్థను ప్రారంభించామన్నారు.
శనివారం భారత్ సమ్మిట్ - ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బా బు మాట్లాడుతూ హెచ్‌ఐసీసీలో 12 అంతర్జాతీయ ప్యానెల్స్, హైటెక్స్‌లో 8 తెలంగాణ రైజింగ్ సెషన్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించామన్నారు. ఏఐ, ప్రపంచ ఆర్థిక వ్యవ స్థలో సమానత్వం, వాతావరణ మార్పులు, శాంతి, మీడియా భవిష్యత్తు, ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరు అంశాలపై నిర్వహించిన చర్చల్లో వివిధ దేశాల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారన్నారు.
ఆలోచనలు వేరు గా ఉన్నా, మరింత సమానత్వంతో, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ, మాన వీయ దృక్పథంతో కూడిన రేపటి ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వెల్లడించినట్లు మంత్రి తెలిపారు.
ఈ సమ్మిట్ తెలంగాణకు గౌరవంతో పాటు బాధ్యతను కూడా తీసుకొచ్చిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రపంచంతో అనుసంధానమవుతూనే సామాజిక న్యా యానికి కట్టుబడి ఉండొచ్చని, అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆత్మ గౌరవం కలిసే ముం దుకు సాగొచ్చని తెలంగాణ నిరూపిస్తోందన్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ రైజిం గ్ గ్లోబల్ సమ్మిట్ 2.0కు హాజరు కావాలని దేశ, విదేశీ ప్రతినిధులను మంత్రి కోరారు.