పడీపడీ నవ్వడమే బాకీ ఉందిక!

15-11-2026 | 05:20am

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు(NTR) ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవరసాల్లో ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే ఈ స్టార్ హీరో.. ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడితో(director Anil Ravipudi) ఓ పవర్ ప్యాక్డ్ మూవీ చేయటానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్, అనిల్ రావిపూడి వారి అప్‌కమింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవి పూర్తి కాగానే ఈ సినిమాను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, అనిల్ రావిపూడి కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబో మూవీకి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని టీమ్ తెలియజేసింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ హీరో, డైరెక్టర్.. ఉభయులూ శనివారం వెల్లడించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

‘నవ్వుల విందు సిద్ధమవుతోంది’ అని ఎన్టీఆర్ పేర్కొనగా, ‘మన కాంబినేషన్ ఎప్పటినుంచో బాకీ ఉంది తారక్ సర్. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం రాబోతోంది. త్వరలో రోలింగ్.. కాదు కాదు.. రోఫ్లింగ్ (ROFLing నేలపై దొర్లుతూ పగలబడి నవ్వటం) అని దర్శకుడు అనిల్ పోస్ట్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించనున్నారు. 

మరిన్ని వార్తలు