ఆపరేషన్ మోల్!
వెర్సటైల్ స్టార్ ధనుష్(Versatile star Dhanush), మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Malayalam Megastar Mammootty) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ.ఎం: చాప్టర్ 1 రుధిరం: ది బ్లడ్ వుడ్’. ఇప్పటిదాకా ‘ఓమ్’ అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం పేరును మేకర్స్.. సెన్సార్ ఆంక్షల నేపథ్యంలో ‘ఒ.ఎం’గా మార్చారు. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి కథను అందించి, స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ నిర్మిస్తున్నారు.
ఇందులో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా, మలయాళ విలక్షణ నటుడు ఇంద్రన్స్, టాలీవుడ్ యంగ్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మాస్, యాక్షన్ వైబ్స్‌తో ఆకట్టుకుంటోందీ ట్రైలర్. ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్; డీవోపీ: ఎళిల్ అరసు కే; ఎడిటర్: ఆర్ కళైవానన్; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం.