జీవితంలో పొందని అనుభూతి ఈ పాత్రలో అనుభవించా!
సౌత్ స్టార్ దుల్కర్ సల్మాన్(South star Dulquer Salmaan) హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో(Director Pavan Sadineni) తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాత్విక వీరవల్లి విలేకరులతో ఈ సినిమా విశేషాలను పంచుకుంది. ఆ ముచ్చట్లు ఇవీ..
నేను యూఎస్‌లో పుట్టి పెరిగా. ఇంజినీరింగ్, మాస్టర్స్ పూర్తి చేసి, రెండేళ్లు ఇంజినీర్‌గా పనిచేశా. క్రియేటివ్ రంగంలోకి వస్తే బాగుంటుంద నిపించింది. మొదట ‘కాంత’ చిత్రానికి ఆడిషన్ ఇచ్చా. కానీ ఎంపిక కాలేదు. మరో తమిళ చిత్రానికి ఎంపిక కావడంతో ఇండియా వచ్చా. కొన్ని రోజుల తర్వాత ‘ఆకాశంలో ఒక తార’ అవకాశం రావడంతో ఉద్యోగాన్ని పక్కనపెట్టేశా. మా ఇంట్లో నాన్న ఒక్కరే తెలుగు మాట్లాడతారు. దీంతో నాకు తెలుగు త్వరగానే అలవాటైంది. ఈ సినిమా కోసం లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నా.
ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర చాలా అమాయకత్వంతో కూడుకున్నది. అయితే నిజ జీవితంలో నా వ్యక్తిత్వం అలా ఉండదు. ఏదైనా మొహం మీదే చెప్పేస్తా. సినిమాలో నా పాత్ర చాలా ప్రశాంతంగా ఉంటుంది.. ఎప్పుడూ తన ఆలోచన అంతరిక్షం గురించే. చాలా మృదువుగా మాట్లాడు తుంది. నా బాల్యంలో నేను కూడా ఇలాగే అమాయ కంగా ఉండేదాన్ని. ఆ జ్ఞాపకాలను ఈ పాత్ర చేయడానికి ఉపయోగించు కున్నా.
నాకు సైన్స్ మీద కొంత అవగాహన ఉంది. అయితే ఇంజినీరింగ్‌కు, ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌కు చాలా వ్యత్యా సం ఉంటుంది. అయినప్పటికీ నాకు ఒక పునాది ఉండటంతో మిగతా విషయాలన్నీ అర్థం చేసుకోగలిగా. స్క్రిప్టును చాలా లోతుగా అర్థం చేసుకున్నా. అదే నేను ఈ సినిమా కోసం చేసిన హోంవర్క్.
దుల్కర్ సల్మాన్ చాలా మంచి వ్యక్తి. మొదటి రోజు షూటింగ్లో నేను చాలా టెన్షన్ పడ్డా. ఇందులో ఒక జాతర సీన్ ఉంది. అప్పుడు నేను చాలా మంది మధ్యలో నటించాల్సి వచ్చింది. మొదట్లో చాలా భయపడ్డా. ఆ సమయంలో దుల్కర్ ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేను.
శ్రుతి హాసన్, రుహాని శర్మ అద్భుతమైన పెర్ఫార్మర్స్. అలాంటి వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా అనిపించింది. రుహానీని తొలిసారి కలిసినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏదైనా సహాయం కావాలన్నా తనను అడగమని చెప్పారు. శ్రుతి హాసన్ నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆమె ఒక పవర్‌హౌస్.
యూఎస్‌లో పుట్టి పెరిగిన నేను ఈ సినిమాలో విలేజ్ అమ్మా యిగా నటించా. -నిజానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. స్కూల్ డ్రెస్‌లో నన్ను నేను అద్దంలో చూసుకున్న ప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యా. నేను ఇలా కూడా కనిపించవచ్చా అనిపించింది. మా అమ్మ కూడా నాలో వచ్చిన ఈ మార్పును చూసి చాలా ఆనందపడింది. -నా జీవితంలో ఎప్పుడూ అనుభవించని ఒక పాత్రలో నటించడం చేయడం కొత్త అనుభూతినిచ్చింది. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ చేశా.
నటిగా అనేక పాత్రల్లో జీవించవచ్చు. అది కేవలం సినిమా ఇచ్చే మ్యాజిక్. సినిమాలోనే అది సాధ్యపడుతుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆ పాత్రకు న్యాయం చేయాలి.
నేను ఏదైనా సాధించగలనని మా తల్లిదండ్రులు --చిన్నప్పటి నుంచి నమ్మేవారు. అలాంటి ప్రోత్సాహం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఇక ఈ సినిమాలో స్ఫూర్తిని ఇచ్చే అంశం ఏమింటే.. -ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటుం టారు. ఈ సినిమాలో ఒక అమ్మాయి విజయం వెనుక ఒక గొప్ప మనసున్న అబ్బాయి ఉంటాడు. నా దృష్టిలో ఈ రెండు అంశాలూ ఉండాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తే జీవితం చాలా అందంగా ఉంటుంది.
ఇక నా నుంచి రాబోయే సినిమాల గురించి చెప్పాలంటే.. -తమిళంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. అలాగే తెలుగులో మరో సినిమా ఉంది. త్వరలోనే వాటి గురించి అధికారిక ప్రకటనలు వస్తాయి.