జార్జ్ క్రిష్ కోసం మాటల గలగలలు!
వరుసగా రెండు హిట్లు కొట్టిన చార్మింగ్ స్టార్ శర్వా(Charming Star Sharwa), శ్రీను వైట్ల దర్శకత్వంలో(Director Srinu Vaitla) తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’తో హ్యాట్రిక్ హిట్ పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వా సరసన మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ‘ఫస్ట్ బూస్టర్’ పేరుతో విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.
ఇందులో శర్వానంద్‌ను రెండు విభిన్న మతాలకు చెందిన పాత్రల్లో పరిచయం చేశారు. క్రిస్టియన్‌గా జార్జ్, హిందువుగా క్రిష్ పాత్రల్లో శర్వా అలరించారు. పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో ఈ రెండు పాత్రలను చూపిస్తూ అంచనాలు పెంచేశారు. ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనువైట్ల, హీరోయిన్ మానస వారణాసి పాల్గొన్నారు.
డబ్బింగ్ ప్రారంభమైన సందర్భంగా హీరోయిన్ మానస వారణాసి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వహిస్తుండగా, కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమర్‌రెడ్డి కుడుముల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.