ఆంగ్ల వత్సరాదిన వింటారా సరదాగా
15-11-2026 | 05:15am
యంగ్ హీరో అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్(Youthful entertainer) ‘వీఐఎస్ఏ సరదాగా’(VISA Saradaga) న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. ఈ చిత్రం 2027, జనవరి 1న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తాజాగా ప్రకటించారు. ఉద్భవ్ రఘు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెరికా నేపథ్యంలో సాగుతుంది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వివా హర్ష, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.