హసీనా అప్పగింతపై రెండు షరతులు
- బంగ్లా ఆర్మీ తీసుకువెళ్లాలి, న్యాయ పోరాటానికి హామీ ఇవ్వాలి
- భారత్ ఉన్నతస్థాయి చర్చలు
- పేర్కొన్న బంగ్లా జాతీయ పత్రికా కథనం
న్యూఢిల్లీ, నవంబర్ 14: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను(Former Prime Minister of Bangladesh Sheikh Hasina) సురక్షితంగా ఆ దేశ సైన్యమే తీసుకువెళ్లాలని, మరణశిక్షకు వ్యతిరేకంగా నిష్పక్షపాత విచారణ జరుపుతామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని భారత్ రెండు షరతులు విధించినట్లు ఆ దేశ జాతీయ పత్రి క శనివారం వెల్లడించిన ఓ కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. షేక్ హసీనా అప్పగింతపై భారత్ గత కొన్ని నెలలుగా ఆ దేశ ప్రభుత్వం, సైనికాధికారులతో చర్చలు జరుపుతుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల పలుమార్లు భారత్ సైనిక ఉన్నతాధికా రుల మధ్య చర్చలు కూడా జరిగాయి. అయితే తెరవెనుక ఏం జరుగుతుందనేది మాత్రం స్పష్టత లేదు. కాగా బంగ్లా నుంచి ఈ విషయంపై స్పష్టమైన హామీ లభిస్తేనే తదుపరి నిర్ణయం తీసుకునే అంశంపై భారత్ ముందుకు వెళ్లనుంది. 2024లో బంగ్లాదేశ్ నుంచి భారత్కు ఆ దేశ సైనిక విమానంలోనే షేక్ హసీనా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సురక్షితంపై ఆ దేశ సైన్యమే బాధ్యత వహించాలని భారత్ భావిస్తుంది.
లేదా ఆమెను సరిహద్దు ప్రాంతం నుంచైనా సైనిక అధికారులు తీసుకువెళ్లవచ్చు. ఈ అంశంపై ఇతర ఏర్పాట్లకు భారత్ సంసిద్ధంగా ఉంటుంది. ఇక రెండో షరతు.. బంగ్లాదేశ్ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ శిక్షపై న్యాయపరంగా పోరాడేం దుకు అవకాశం కల్పించాలని కోరుకుంటుంది. 2024లో జరిగిన అల్లర్లు, హింసా త్మక ఘటనలపై ప్రపంచ మీడియా పర్యవేక్షణలోనే నిష్పక్షపాత విచారణ జరగాలని భారత్ కోరుకుంటుంది.
హసీనా బంగ్లాదేశ్లో తన హక్కులను కాపాడుకుంటూ సురక్షితంగా ఉండాలని భారత్ భావిస్తున్నట్లు ఆ కథనంలో పేర్కొంది. అయితే జాతీ య పత్రిక పేర్కొన్న విషయాలు, డిమాండ్లపై ఇటు భారత్ నుంచి కానీ, అటు బంగ్లా నుం చి కానీ ఎలాంటి ప్రభుత్వ ప్రకటన, ధృవీకరణ లేదు. కాగా షేక్ హసీనా నవంబర్ 9న నూతన పాస్పోర్టు, ప్రయాణ పత్రాల కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వంతో అధికారికం గా సంప్రదింపులు జరిపారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనాపై 150 కేసులు నమోదుకావడం గమనార్హం. షేక్ హసీనా మాట్లాడు తూ.. ప్రజలు కోరుకుంటే, నేను బంగ్లాదేశ్లో మళ్లీ అధికారాన్ని చేపడతానన్నారు.
నిర్ణయం భారత్ చేతిలో..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి దేశానికి తీసుకువచ్చేందుకు చట్టపర మైన అన్ని ప్రక్రియలను పూర్తి చేశామని, ఇప్పుడు నిర్ణయం భారత్ చేతిలో ఉందని ఆ దేశ న్యాయశాఖ మంత్రి మహమ్మద్ అసదు జ్జమాన్ ప్రకటించారు.