నెహ్రూకు ఘన నివాళి

15-11-2026 | 05:10am
  1. 137వ జయంతి సందర్భంగా పలువురి శ్రద్ధాంజలి
  2. శాంతివన్‌లో పుష్పాంజలి ఘటించిన ఖర్గే, సోనియా 
  3. నెహ్రూ.. భారత్‌కు లభించిన ఆణిముత్యం: రాహుల్ 

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(first Prime Minister Pandit Jawaharlal Nehru) 137వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ సహా పలువురు ఘన నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో నెహ్రూను స్మరించుకుంటూ మోదీ పోస్టు చేశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు ప్రముఖులు నెహ్రూ సేవలను గుర్తు చేసుకున్నారు.

శాంతివన్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోని యా గాంధీ, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు నెహ్రూ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. నెహ్రూను భారత్‌కు లభించిన ఆణిముత్యంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఆధునిక భారత దేశానికి రూపశిల్పిగా ఖర్గే కొనియాడారు. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నెహ్రూ చిత్రపటానికి ఖర్గే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఆధునిక భారత నిర్మాణంలో నెహ్రూ పోషించిన పాత్రను కాంగ్రెస్ నేతలు స్మరించుకున్నారు. దృఢ సంకల్పం, దార్శనికతతో భారత్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చి దిద్దడంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారని కేరళ సీఎం వి.డి.సతీశన్ కొనియాడారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించారు.

మరిన్ని వార్తలు