02-10-2025 01:35:32 AM
సిద్దిపేట, అక్టోబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కు పీఆర్సీని ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బెనిఫిట్స్, అలవెన్సు, ఏరియాస్ తక్షణమే తీర్చాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్రం దసరా పండుగకు కేం ద్ర ఉద్యోగులకు 3శాతం డీఏని మంజూరు చేసి తీపి కబురునిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదు కబురు అందిందంటూ విమర్శిం చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పరిణామాలు చేదుగా ఉన్నాయని ఆరోపించారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల ముందు పెండింగ్ డీఏలను తక్షణమే చెల్లిస్తామని హామి ఇచ్చినప్పటికీ చర్యలు కనిపించలేవని మండిపడ్డారు.
డీఏ అంటే డియర్‌నెస్ అలవెన్స్ కానీ రేవంత్‌రెడ్డి వద్ద డీఏ అంటే ‘డోంట్ ఆస్క్’ అవుతోందంటూ ఎద్దేవా చేశారు. రూ.5,500 కోట్లు కంట్రిబ్యూటరీ పెన్షన్ డబ్బులు ప్ర భుత్వం ఉపయోగించినదని, అవి వెంటనే సీపీఎస్ ఖాతాలకు తిరిగి చెల్లించాలని కోరారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధర ణ గు రించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాం డ్ చేశారు. పోలీసులకు 14 డీఏలు పెండింగ్ లో ఉండగా, 5 సరెండర్ లీవులు కూడా లేకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
పోలీ సు స్టేషన్ నిర్వహణ అలవెన్స్, పెట్రోల్, డీజె ల్ ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్నార ని చెప్పారు. రైతుల విషయంలో కేంద్ర నిర్ణయంపై ప్రశ్నించారు. గోధుమ మద్దతు ధరను రూ.2,585 (క్వింటాలుకు రూ.160)గా పెంచినప్పటికీ వరి మద్ద తు ధరలో తేడా ఉండటం అన్యాయమని చె ప్పారు. ఉత్తర భారత రైతులకు ఒక న్యాయం, దక్షిణ భారత రైతులకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. వరికి కూడా గోధుమలతో సమాన మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.