calender_icon.png 2 October, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటిన ఎండీఆర్ ఫౌండేషన్

02-10-2025 12:00:00 AM

పటాన్ చెరు, అక్టోబర్ 1 :పటాన్చెరు ని యోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో ని ఉన్న మదర్ మేరీ ఓల్ ఏజ్ హోంలో సు మారు పది సంవత్సరాలుగా నివసిస్తున్న ఆర్యవైశ్య కులానికి చెందిన శివ అనే వృ ద్ధుడు మంగళవారం రాత్రి కన్నుమూశారు. శివ కు అంత్యక్రియలను ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ కో-ఫౌండర్ మా దిరి పృథ్వీరాజ్, అధ్యక్షులు మధు స్వయం గా నిర్వహించారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు మధు మాట్లాడుతూ ఎండిఆర్ ఫౌం డేషన్ ద్వారా ఇప్పటి వరకు 683 పైగా అనాథలకు గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వ హించినట్లు తెలిపారు. ఎండిఆర్ ఫౌండేషన్ ఉన్నంత వరకు ఎవరు ఒంటరిగా, అనాథగా చనిపోరాదనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి ఒక్కరి జీవితానికి విలువ ఉందని, వృద్ధులు, అనాథలు చివరి శ్వాస విడిచిన తర్వాత కూడా గౌరవంతో వీ డ్కోలు ఇవ్వడం మా బాధ్యత అన్నారు. అ లాగే ఫౌండేషన్ కార్యకలాపాలకు నిత్యం అండగా నిలుస్తున్న మాదిరి ప్రిథ్వీరాజ్, ఆ యన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.