02-10-2025 12:00:00 AM
గద్వాల, అక్టోబర్ 01 ( విజయక్రాంతి ) / అలంపూర్ : రోజు మాదిరిగానే పగలంతా కష్టపడి తమ పనులు చేసుకుంటూజనమం తా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్న ఆయా గ్రామాల్లో, అలంపూర్ పట్టణంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోగా వరద ఉప్పెనలా ముంచుకొచ్చింది. ఇళ్లు, వాకిలి, వస్తువులు, పొలాలన్నీ కండ్ల ముందే జలమయమయ్యా యి.
ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు నెల రోజుల పాటు ఆయా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో బయటపడిన సందర్భం. రెండు ( కృష్ణ, తుంగభద్ర ) నదులు కలిసి సుమారు 43 గ్రామాలు, అలంపూర్ పట్టణంపై ముప్పేట దాడి చేసిన ఈ జలప్ర ళయంలో వేలాది ఇళ్లు జలమయం కాగా.. లక్షకు పైగా ఎకరాల్లో పంటలు నీట మునిగగా అపార ఆస్తి నష్టం వాటిల్లింది.
ఈ జల ప్రళయ సంఘటనకు నేటికి ( అక్టోబర్ 02 ) సరిగ్గా 16 ఏండ్లు పూర్తి అవుతుంది. అయి నా.. ఆ వరదలను ఊహించుకుంటే ఇప్పటికీ బాధిత గ్రామాల ప్రజలు ఉలిక్కి పడతున్నారు. 16 ఏండ్లు క్రితం ముంచెత్తిన వరదల గురించి ఎవరిని అడిగినా కన్నీటిధారలే.. కో లుకునే వరకు పడ్డ ఇబ్బందులు.. పడ్డ కష్టం ఇలా ఎవరిని తట్టినా దీనగాథలే వినిపిస్తాయి. పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ ఎప్పు డు ఉగ్రరూపం దాలుస్తుంది? ప్రశాంతంగా ప్రవహిస్తోన్న తుంగభద్ర ఎప్పుడు పోటెత్తుతుందో అనే ఆందోళన ఇప్పటికీ ఆయా గ్రామాల ప్రజలను వెంటాడుతూనే ఉంది.
కండ్ల ముందే ఊరు మొత్తం మునిగింది
16 ఏండ్ల క్రితం వచ్చిన వరదలను తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తదని స్థానికులు తెలుపుతున్నారు వరద అప్పుడే మొదలైంది అందరం చూస్తుండగానే ఊరు మొత్తం మునిగిపోయింది. ఊళ్లోకి నీళ్లొస్తున్నాయని అంతకు ముందు రోజు రాత్రి నుంచే గ్రామంలో మేమెవ్వరం కూడా నిద్రపోలేదని . ఉదయం 5 గంటలకు మెల్లగా నీరు ఊర్లోకి రావడం మొదలైంది. 9 గంటల కంతా ఊరు మొత్తం నీరు చేరుకుని చుట్టు ముట్టింది. మమ్మల్ని రోడ్డు మీద పడేసిన ఆ ఘటన తలుచుకుంటే కంట్లో నీళ్లు ఆగవని స్థానికులు చెబుతున్నారు.
సర్వం కోల్పోయిన వారికీ పట్టాల చుట్టూ రాజకీయ లిస్టు... .
2009 సంవత్సరం అక్టోబర్ 02 న వచ్చిన వరదల వల్ల సర్వం కోల్పోయిన అ లంపూర్ పట్టణ ప్రజలను ఆదుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటి అధికార ప్రభుత్వం విఫలమైనదని స్థానికులు తమ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు. వరదలు వచ్చిన తరువాత భాదితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని సర్వం కోల్పోయిన వారికీ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఆదుకుంటామని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 43 ఎకరాల్లో వరద ప్లాట్లు కేటాయించిన నేటికీ భాదితులకు పట్టాలు రాక ఆ స్థలం లో కంప చెట్లు దర్శనమిస్తున్నాయి. అదిగో పట్టాలు ఇదిగో పట్టాలు తప్ప తమకు ఇచ్చింది లేదంటూ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ నాటి వరద భాదితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
లిస్టులు మారుతున్నాయి కానీ బాధితులకు న్యాయం :
2009 సంవత్సరంలో వరదల వల్ల సర్వం కోల్పోయిన అలంపూర్ పట్టణ ప్రజలను ఆదుకోవడంలో ఆనా టి కాంగ్రెస్ ప్రభుత్వం నేటి అధికార ప్రభుత్వం విఫలమైం ది. అప్పటి ఎమ్మెల్యే అబ్రహం వరద భాదితుల కోసం ప్ర భుత్వం కేటాయించి 16 సంవత్సరాలు పూర్తి అయిన కూ డా ఇప్పటివరకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయకుండా కేవ లం కాగితాలకు మాత్రమే పరిమితమైనది. అప్పుడున్న ఎ మ్మెల్యే డా.వి.ఎం. అబ్రహం లిస్టు తయారు చేసి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది.
దాని అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన సంపత్ కుమార్ ఆ లిస్టులో ఎక్కువమంది అబ్రహం అనుచరులు ఉన్నారని, ఆ పట్టాలను రద్దు చేయించడం జరిగింది. అనంతరం సంపత్ కుమార్ మరో లిస్టు తయారు చేయించడం జరిగింది, తర్వాత జరిగిన ఎన్నికలలో అబ్రహం గెలుపొంది సంపత్ కుమార్ చేయించిన లిస్టు రద్దుచేసి మరో లిస్టును త యారు చేయించడం కూడా జరిగింది. కేవలం ఈ విధంగా లిస్టు మారుతున్నాయి తప్ప బాధితులకు స్థలాలు పంపిణీ చేయాలి అని ఈ ఎమ్మెల్యేలకు సోయి లేదు.
బోరవెల్లి మహేష్
బీఎస్పీ అలంపూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు