calender_icon.png 24 May, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని బస్టాండ్‌లో బస్సులు లేక ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

24-05-2025 12:36:24 AM

మంథని,(విజయక్రాంతి): మంథనిలో బస్ స్టాండ్ ప్రాంగణన్ని సందర్శించి ప్రయాణికుల ఇబ్బందులను బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు  చంద్రుపట్ల సునీల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి పుష్కరాల సందర్భంగా మంథని బస్ స్టేషన్ లో సరిపోయాన్ని బస్సులు లేకపోవడంతో పాటు బస్టాండ్ లో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. కాళేశ్వరం వేళ్ళే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయి, వర్షం నీటితో బస్ స్టాండ్ ప్రాంగణం నిండిపోయి ఉన్నదని, కానీ ఇప్పటి వరకు అధికారుల నుండి ఎలాంటి స్పందనలదన్నారు.

ఇప్పటికైనా పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని, బస్ లో ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే జిల్లాల నుండి బస్ లు తెప్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోతారవేని క్రాంతి కుమార్, మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, ఓబీసీ మండల అధ్యక్షుడు రేపక శంకర్, మండల నాయకులు విష్ణు, శంకర్, సంతోష్, జెట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు.