calender_icon.png 25 May, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

24-05-2025 12:35:06 AM

దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్

దేవరకొండ, మే 23: దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ లబ్ధిదారులకు అందించారు. 271మంది లబ్ధిదారులకు 10763250 /- రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి లాంటి పథకాలు ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు భరోసా ఇస్తున్నాయి అని పేర్కొన్నారు.

దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హత కలిగిన లబ్దిదారునికి ఈ పథకాల ద్వారా లాభాలు చేరేలా నిత్యం కృషి చేసి,ప్రజల సంతోషమే నా ప్రోత్సాహం, అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.