24-05-2025 12:37:04 AM
ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్
యాదాద్రి భువనగిరి మే 23 ( విజయక్రాంతి ) : మావోయిస్టు అగ్ర నాయకులు కేశవరావు ఎన్కౌంటర్ తో పాటు ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై అత్యా నేరము కేసులు నమోదు చేయాలనీ ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఎన్కౌంటర్ల పేరుట పోలీసులు మావోయిస్టులను హత్య చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. ఐక్యవేదిక కన్వీనర్ బట్టు బట్టు రామచంద్రయ్య. తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యులు కావలి యాదయ్య.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎశాల అశోకు మండల కార్యదర్శి దాసరి లక్ష్మయ్య.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కమిటీ అధ్యక్షులు, కాశపాక మహేష్ ప్రధాన కార్యదర్శి రాసాల నరసింహ్మ, తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు మచ్చ ఉపేందర్. మాట్లాడుతూ సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అనారోగ్యంతో ఉండగా ఒరిస్సా రాష్ట్రంలో పట్టుకొని చత్తీస్గడ్ దండకారణంలోని అంబుజమాడు అడవులలో హత్య చేసి ఎన్కౌంటర్ కట్టుకథలు అల్లుతున్నారన్నారు.
కామ్రేడ్ కేశవరావు అలియస్ బసవరాజుది నిజమైన ఎన్కౌంటర్ గా నమ్మించెందుకు అమాయకులైన మరో 24 మంది ఆదివాసులను హత్య చేసి భారీ ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తూ ప్రజలను నమ్మబల్కుతున్నారు అని ఆరోపించారు. దేశంలోని పౌర సమాజమంతా ఒకవైపు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తుంటే పట్టించుకోక మానవ హక్కులను కాలువస్తూ ఎన్కౌంటర్ల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అనేకమంది మావోయిస్టు నాయకులు అనారోగ్యంతో బాధపడుతుండగా నిరాయుదంగా పట్టుకొని హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు @ బసవరాజును కూడా హత్య చేసి ఎన్కౌంటర్ కట్టు కథలు అల్లడం భారత పాలకులకు పోలీసు వర్గాలకు కొత్తేమి కాదన్నారు. నాడు చారు మజందార్ నీ హత్య చేసిన ఇందిరా గాంధీ కూడా నక్సలిజం అంతమయ్యిందని ప్రకటించు కుంది..
పరిణామం ఏమైందో ఇప్పుడు మన కండ్ల ముందే ఉన్నది కనక కేశవరావు అమరత్వంతో ఉద్యమానికి తీరని నష్టం జరగవచ్చు కానీ ప్రజలు తిరిగి అదే పోరాటాన్ని నిలబెడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ మండల సహాయ కార్యదర్శి ఉడుత రాఘవులు తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కమిటీ సభ్యులు రాసాల బాలస్వామి, చిక్కుల కర్ణాకర్, నరాల బాలకృష్ణ, చొప్పరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు