calender_icon.png 9 January, 2026 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలకు కోడిగుడ్లు అందించలేం..

09-01-2026 12:24:31 AM

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 8, (విజయక్రాంతి): కోడిగుడ్డు పిల్లలకు పెట్టలేమని, ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు బిల్లులు ఇవ్వాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ CITU జిల్లా అధ్యక్షులు జి పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డీఈవో  కార్యాలయపు సూపర్నెంట్ కు అందజేశారు.

ఆయన  స్పందిస్తూ కోడిగుడ్ల కు బడ్జెట్  రావడం లేదు, వస్తె వేస్తాం, పెండింగ్ జీతాలు వచ్చాయి, ఈ రెండు రోజులలో ఎకౌంట్లో పడతాయన్నారు.  ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు జి పద్మ మాట్లాడుతూ ప్రభుత్వం 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను పిల్లలు తక్కువ ఉన్నారనే పేరుతో మధ్యాహ్నం భోజన కార్మికులను తొలగించడం సరి కాదన్నారు.

పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా మధ్యాహ్న భోజన కార్మికులను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో గుడ్డు ధర 9 రూపాయలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆరు రూపాయలు చెల్లిస్తుందని  వారానికి మూడు గుడ్లు పెట్టాలని కార్మికుల మీద అధికారులు ఒత్తిడి చేయడం శోచనీయమన్నారు.  ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేస్తే మేము ప్రతిరోజు గుడ్డు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 

జిల్లా కార్యదర్శి Sh సుల్తానా కార్యక్రమంలో  ఆ సంఘం జిల్లా కార్యదర్శి  సుల్తానా, సీఐటీయూ నాయకులు సారిక మిడ్ డే మీల్ జిల్లా కోశాధికారి వెంకట నరసమ్మ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామలక్ష్మి శివకుమారి అరుణ రాణి  నజమ్మా కుమారి నిరోషా సమ్మక్క శైలజ నాగ దుర్గా ఈశ్వరమ్మ నాగుల దేవి క్రాంతి పాల్గొన్నారు