calender_icon.png 9 January, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారం సరికాదు

09-01-2026 12:23:24 AM

గుండాల, జనవరి 8 (విజయక్రాంతి): ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీ గిరిజన మహా జాతరైన శ్రీ మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండేదని అయినప్పటికీ ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క మేడారం జాతరకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరారని కానీ మేడారం జాతర సమయంలో అప్పటి ప్రభుత్వం ఆ నిధులను  విడుదల చేయలేదని మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బొబ్బిలి పవన్ కళ్యాణ్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

ఆ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక నాయకుడు కూడా మేడారం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని, ఆదివాసీ కుమార్తెగా, ములుగు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సీతక్క ఈ సంవత్సరం మేడారాన్ని 200 సంవత్సరాల పాటు ప్రపంచ చరిత్రలో గుర్తుండిపోయేలా చేసే బాధ్యతను తన భుజాలపై వేసుకుని అభివృద్ధి పనులను ప్రారంభించారని, ఆ క్రెడిట్ సీతక్కకే దక్కుతుందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మేడారం జాతర సమయంలో వందలాది ఇసుక లారీలు ఆ రహదారిపై పరుగులతో జాతరకు వచ్చే భక్తుల వాహనాలు ప్రమాదాలకు గురయ్యేవని, ఆ సమయంలో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ధనసరి అనసూయ సీతక్క ఒకవైపు జాతర జరుగుతుండగా, మరోవైపు నడుస్తున్న వందలాది ఇసుక లారీలను ఆపాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారని ఆయన గుర్తు చేశారు. నేడు బీఆర్‌ఎస్ పెయిడ్ యూట్యూబ్, పెయిడ్ పింక్ సోషల్ మీడియాకు చెందిన కొంతమంది మేడారం అభివృద్ధిని తట్టుకోలేక మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జాతరకు నాలుగు రోజులు ఉన్నప్పుడే ఇసుక లారీలను ఆపేవారని, అందుకే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారని, మీరు చెబితే మంత్రి సీతక్క నేర్చుకునే స్థితిలో లేరని, ప్రస్తుత జాతర కోసం ఇప్పటికే కొన్ని లారీలను దారి మళ్లించారని, జాతరకు పదిహేను రోజుల ముందే  ఇసుక లారీలను పూర్తిగా నిలి పివేయాలని సీతక్క ముందుగానే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు మంత్రిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.