calender_icon.png 9 January, 2026 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న మున్సిపల్, కార్పొరేషన్ల ఓటర్ల తుది జాబితా

09-01-2026 12:23:35 AM

  1. ఎన్నికల కమిషనర్ రాణికుముదిని  
  2. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం  

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఆరు మున్సిపల్ కార్పొరేషన్, 117 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేంకదుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. అందులో భాగంగా గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాపై చర్చించారు.

ఈ నెల 12న ఓటర్ల తుది జాబితా, 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి, వాటిని టీపోల్‌లో ఆప్‌లోడు చేస్తామన్నారు. 16న పోలి ంగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూ డిన తుది ఓటర్ల జాబితాను వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీ గా సంబంధిత మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లు ప్రచురిస్తారని వివరించారు.