21-07-2025 12:31:57 AM
మంచిర్యాల, జూలై 20 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీవో ను రద్దు చేయాలనీ, ఇది కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల సపోర్టుగా ఉందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు. జిల్లా ఉపా ధ్యక్షులు మిట్టపల్లి పౌలు అధ్యక్షతన సిపిఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఏఐటియుసి జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు.
282 జీవోతో దుకాణాలు, షాపింగ్ మాల్స్, షోరూమ్స్ లలో పని చేసే కార్మికులకు 8 గంటల నుంచి 10 గంటలు పని చేయాలనీ సూచించటం దారుణమన్నారు. కార్మికుల హక్కులను కోల్పోయే ఈ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ, పారిశ్రామిక కార్మికుల్లో ఎక్కువ మంది అత్యంత ప్రమాదకరమైన, దారుణమైన పరిస్థితుల్లో పనిచేయవలసి వస్తుందనీ, పని ప్రదేశంలో భద్రతపై ఎటువంటి నియంత్రణలు ఉండవన్నారు.
2019, 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 4 లేబర్ కోడ్ లకు సరిగ్గా అనుగుణంగా ఉన్నాయనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటియుసి నాయకులు కలిందర్ అలీ ఖాన్, బీమనాదుని సుదర్శన్, వీరభద్రయ్య, బాజీ సైదా, కొట్టే కిషన్ రావు, జాడి పోషం, ఆఫ్రోజ్ కాన్ పాల్గొన్నారు.