21-07-2025 12:32:42 AM
- మరో వందేళ్లయినా ప్రజలతోనే సమసమాజ స్థాపనే ధ్యేయం
- స్థానిక సమరంలో అవసరమైతే ఒంటరి పోరు
- కొత్తగూడెం కేంద్రంగా సీపీఐ శతజయంతి వేడుక
- కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, జులై 20, (విజయ క్రాంతి):కమ్యూనిజం అజరామరం అని, మ నిషి మనుగడ ఉన్నంత వరకు కమ్యూనిస్టు లు ఉంటారని, ఈ వందేళ్లపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ అనేక పోరాటా లు, త్యాగాలు చేసిందని, రాబోయే వందేళ్ల కూడా అనునిత్యంప్రజాక్షేత్రంలోనే ఉంటామని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూ డెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావుఅన్నారు.
చుంచుపల్లి మండల 8వ మ హాసభ ఆదివారం ఎన్ కె నగర్ లోని కమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది.స భా ప్రాంగణం సిపిఐ జెండాలతో ఎరుపెక్క గా, మహాసభ ప్రారంభ సూచికగా అరుణపతాకాన్ని కూనంనేనిఆవిష్కరించారు. సిహెచ్ మాధవరావు, పి రామచందర్, ఐదావత్ సు గుణ, తోట రాజు, పొలమూరి శ్రీనివాస్ అ ధ్యక్షతనజరిగిన సభలో కూనంనేని మాట్లాడారు.
ఇప్పుడున్నకొన్ని రాజకీయ పార్టీలు బూర్జువా పోకడలతో అటువారు ఇటువా రు అటు మారుతూ అధికారం కోసంవెంపర్లాడుతున్నారని యద్దేవా చేశారు. మేమే గెలిపించామంటూ కొందరు గొప్పలు పోతు న్నారని, కానీ కమ్యూనిస్టులేలేకుంటే మీ పరిస్థితి ఏంటో వారే అర్థం చేసుకుంటే మంచి దన్నారు. తెప్పదాటిన తర్వాత దాన్ని తగులబెట్టే గుణం ఉన్నవారికి ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారని, ఇష్టాను సారంగా పొం గితే పొయ్యిపాలు కాక తప్పదన్నారు. ఇదే పరిస్థితిబిఆర్‌ఎస్ పార్టీకి పట్టిందని గుర్తు చే శారు.
ప్రపంచం వ్యాప్తంగా 260 కోట్ల మం ది ప్రజలు కమ్యూనిస్టుల పాలనలోఉన్నార ని, ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీయే అ తి పెద్ద పార్టీ అని చెప్పారు. ఈ నెల 9న మో డి పాలనకు వ్యతిరేకంగాదేశవ్యాప్త బంద్కు పిలుపునిస్తే 30 కోట్ల మంది రోడ్లమీదికి వ చ్చారన్నారు. ఓట్ల కోసం డబ్బులు వెదజల్లుతూప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తు న్నానరని, దామాషా పద్దతిలో ఓట్లను లెక్కి స్తే ఎవ్వరి సత్తా ఏంటోతేలిపోతుందన్నారు. 1964వ సం.
వరకు కమ్యూనిస్టులంతా కలి సే ఉన్నారని, ఆ తర్వాతే చీలికలువచ్చాయని, ఇకనైనాఅంతా ఏకతాటిపైకి వస్తే రాజ్యం మ నదే అన్నారు. కేంద్రంలోని బిజేపి సర్కార్ ఆ పరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులనుకా ల్చి చంపుతున్నారని, 2026మార్చి 31 నాటి కి దేశంలో మావోయిస్టుల లేకండా చేస్తామ ని చెప్పుకుంటూహతమారుస్తున్నారని, మనిషిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నిం చారు. త్వరలో స్థానిక సమరం జరగనుంది.
కొందరు అంతా తామేఅంటూ ఎక్కువగా ఊహించుకుంటున్నారన్నారు. అయినప్పటి కీ మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలని కమ్యూనిస్టులు గా కోరుకుంటున్నా మ ని, ఆనాటి పరిస్థితులను బట్టి ఒంటరి పోరు చేసేందుకైనా సిపిఐ వెనుకాడదనిచెప్పారు. గ్రామగ్రామా పార్టీని బలోపేతం చేస్తూ స్థాని క సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
కొత్తగూడెం కేంద్రంగా శతజయంతి వేడుక- సిపిఐ శతజయంతి వేడుక 2026 డిసెంబర్ 26న కొత్తగూడెంకేంద్రంగా కనీవినీ ఎరుగని రీతిలో జరగబోతోందని, కమ్యూనిస్టుల స త్తా ఏంటో కారుకూతలు కూసేవారికిచూపిస్తామన్నారు. ఈ వేడుకకు ప్రపంచ దేశాల వ్యాప్తంగా కమ్యూనిస్టు యోధులు తరలిరానున్నట్లు కూనంనేని తెలిపారు.అనంతరం సి పిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మా ట్లాడుతూ స్థానిక సంస్థల సమరానికి అంతాసిద్ధంగా ఉండాలన్నారు.
ఈ మహాసభలో జి ల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాశి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, చలిగంటిశ్రీ నివాస్, చండ్ర నరేంద్ర కుమార్, చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళీ, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటిశేషయ్య, వం గా వెంకట్, గనగల్ల వీరస్వామి, వై.ఉదయ్ భాస్కర్, గెద్దాడు నగేష్, కంచర్ల జమలయ్య, బోనోత్ గోవింద్,బరిగల సంపూర్ణ, రమణమూర్తి, శ్రీశైలం, యాండ్ర మహేష్, ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.