పామాయిల్ నుంచి సన్‌ఫ్లవర్‌వైపు షిప్ట్

24-04-2024 01:19:21 AM

ముంబై, ఏప్రిల్ 2౩: ప్రపంచ మార్కెట్లో పామాయిల్ ధరలు భారీగా పెరగడంతో అందుకు బదులుగా భారత్‌లో దిగుమతిదారులు పొద్దుతిరుగుడు నూనె వైపుమొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా మార్చి నెలలో పామాయిల్ దిగుమతులు 10 నెల ల కనిష్ఠస్థాయికి పడిపోగా, సన్‌ఫ్లవర్ దిగుమతు లు రికార్డుస్థాయికి పెరిగాయని సాల్వె ంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా (ఎస్‌ఈఏ) తాజా ప్రకటనలో తెలిపింది. మార్చి లో పామాయిల్ దిగుమతులు ఫిబ్రవరితో పోలిస్తే 2.5 శాతం క్షీణించి 4,85,354 టన్నులకు తగ్గాయని, 2023 మే నెల తర్వాత ఇవే కనిష్ఠమని అసోసియేషన్ వెల్లడించింది.

మరోవైపు సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఫిబ్రవరికంటే 50 శాతం పెరిగి 4,45,723 టన్నులకు పెరిగిన ట్టు తెలిపింది. ఈ పరిమాణం రెండో రికా ర్డు గరిష్ఠం. మలేషియా పామాయిల్ ఫ్యూచ ర్స్ ధర ఏడాది గరిష్టానికి పెరగడంతో దిగుమతిదారులు కొనుగోళ్ల ను తగ్గించి పొద్దు తిరుగుడు నూనె వైపు షిప్ట్ అయ్యారని ఎస్‌ఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. క్రూడ్ పామాయిల్ టన్ను ధర 1,040 డాలర్లకు చేరగా, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ అయిల్ 1,015 డాలర్లు, 975 డాలర్ల చొప్పున విదేశీ మార్కెట్లో లభిస్తున్నాయన్నారు. మార్చిలో సోయా నూనె దిగుమతులు 26% వృద్ధిచెంది 2,18,604 టన్నులకు పెరిగినట్టు చెప్పారు.