17-09-2025 08:31:54 PM
మంగపేట,(విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలో ఉద్యమకారులు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ఉద్యమకారులకు సన్మానం చేసి జిల్లా సరిహద్దు అయిన బ్రాహ్మణపల్లిలో కొలువై ఉన్న నాగులమ్మ ను దర్శించుకొని గుడి అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అదే విధంగా దోమెడ గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి కోసం సాయ సహకారాలు అందిస్తానన్నారు. రామచంద్రునిపేట గ్రామానికి చెందిన పోటూరు శ్రీకాంత్ ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు.