calender_icon.png 31 October, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు చోరీ వ్యతిరేక సిగ్నేచర్ క్యాంపెయిన్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన

30-10-2025 10:43:11 PM

రాహుల్ గాంధీ, ఖర్గే పిలుపు-రేవంత్ రెడ్డి ఆదేశాలపై 18 వేల సంతకాల సేకరణ

సంగారెడ్డి (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓటు చోరీ వ్యతిరేక సిగ్నేచర్ క్యాంపెయిన్ కు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా స్పందించారు. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించబడింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల 89 గ్రామ పంచాయతీలు, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల 64 వార్డుల్లో విస్తృతంగా సంతకాల సేకరణ జరిపి, 18 వేల మంది ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది. రాహుల్ గాంధీ, ఖర్గే పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ప్రజల సంతకాలను సేకరించాం. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు అందరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చేర్యాల ఆంజనేయులు, సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్, సంగారెడ్డి మండల అధ్యక్షుడు బుచ్చిరాములు, కొండాపూర్ మండల అధ్యక్షుడు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మండల అధ్యక్షుడు సిద్దన్న, సదాశివపేట పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు రామచందర్ నాయక్, కుమార్, నాయకులు కూన సంతోష్, కిరణ్, నర్సింహారెడ్డి, ఆశి రెడ్డి, గుండు రవి, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు