calender_icon.png 5 September, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య, వైద్యానికి పెద్ద పీట

03-09-2025 01:40:17 AM

  1. ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలందిస్తాం
  2. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 
  3. రూ.౧౮౬ కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ తదితర భవనాలను ప్రారంభించిన మంత్రి
  4. మహబూబాబాద్‌కు ౧,౮౦౦ మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు
  5. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  6. వైద్యశాఖ బలోపేతానికి కృషి
  7. మంత్రి కొండా సురేఖ

  8. మహబూబాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ర్టంలో విద్య, వైద్యానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గత ప్రభు త్వం చేసిన అప్పులను తీర్చడంతోపాటు అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ర్ట ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు.

  9. మహబూబాబాద్ జిల్లాలో రూ.186 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజ్, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్, వైద్య విద్యార్థుల హాస్టల్ భవనాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబా బాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రాజ నరసింహ మాట్లాడుతూ రాష్ర్టంలోని ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపట్టిందని అన్నారు. 

  10. అందులో భాగంగానే రాష్ర్టవ్యాప్తంగా వైద్య కళాశాలలు 16 ప్రభుత్వ నర్సిం గ్ కాలేజీలు నిర్మించి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించడం కోసం నిబద్దతతో ముందుకు సాగుతుందన్నారు. రాష్ర్టంలోని అన్ని వైద్య కళాశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. అవయవాల మార్పిడి ద్వారా ఈస్టర్న్ తెలంగాణ హబ్ గా మారాలని సూచించారు. వైద్య రంగంలో నూతన టెక్నాలజీ వినియోగించి ముందుకు సాగాలన్నారు. జిల్లా కేంద్రంలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

యూరియా కొరత తీరుస్తున్నాం:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ర్టంలో యూరియా కొరత అంశం పెద్దగా చేసి, రైతులను ప్రభుత్వం పైకి రెచ్చగొట్టేలా బీఆర్‌ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ర్టంలో రైతులకు యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ, యూరి యా సరఫరా చేయాల్సిన కేంద్రం, రాష్ట్రానికి కేటాయింపుల్లో కోత విధించడం వల్ల ఇబ్బంది కలిగిందని అన్నారు.,ముఖ్యమం త్రి, శాఖ మంత్రి ఇప్పటికే కేంద్రంతో అనేక దఫాలుగా మాట్లాడారని, రాష్ట్రానికి యూరి యా దిగుమతి జరుగుతోందని,

మహబూబాబాద్ జిల్లాకు 1,800 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ర్ట అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుంటేనే రాష్ర్టం అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని, అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని వైద్యశాఖ బలోపేతానికి కృషి చేస్తా మన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కోరారు.

ముఖ్యమం త్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతం కాబట్టి అధిక నిధులు కేటాయించి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా అభివృద్ధికి మరింత చేయూతని అందించాలని వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ, అటవీ దేవదాయ శాఖ మంత్రులను కోరారు.   

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె. అనిల్ కుమార్, డిఎంఈ డాక్టర్  కె. నరేంద్ర కుమార్, ఎన్‌ఎంసి రాష్ర్ట కోఆర్డినేటర్ డాక్టర్ విమల తమస్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లకావత్ వెంకట్, ప్రభుత్వ హాస్పిటల్ సూపరెంటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.