26-11-2025 12:00:00 AM
- అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు
- గజ్వేల్‌లో వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన కలెక్టర్ హైమావతి
గజ్వేల్, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలలో మహిళలకు పెద్దపీట వేస్తుందని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి భాగంగా గజ్వేల్ ఐఓసి లో గజ్వేల్ నియోజకవర్గం లోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. గజ్వేల్ నియోజకవర్గం సంబంధించి 6 మండలాలకు గాను3718 స్వయం సహాయక సంఘాలకు 3 కోట్ల 99 లక్షలు వడ్డీలేని రుణాల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ ఇందిరమ్మ చీరలు ధరించి వచ్చిన మహిళలను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నేను కలెక్టర్ గా విధుల్లో చేరిన తర్వాత మహిళలతో చాలా సార్లు సమావేశం కావడం జరిగిందనీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, రేషన్ కార్డు పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీలేని రుణాల పంపిణీ ఇతర కార్యక్రమాల్లో మహిళాలుందరిని కలవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
కాగా జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు డిసెంబర్ 2023 నుండి ఆగస్టు 2024 వరకు గల రూ.28.97 కోట్లు, సెప్టెంబర్ 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు రూ.15.59 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, అడిషనల్ డిఆర్డిఓ సుధీర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు రేణుక, మండల సమాఖ్య అధ్యక్షులు, పలు మార్కెట్ కమిటీ చైర్మన్లు విజయ మోహన్, శ్రీనివాస్ రెడ్డి అధికారులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.