26-11-2025 12:00:00 AM
బీసీ సంఘాల డిమాండ్
ఎన్నికల నోటిఫికేషన్ జారీని వ్యతిరేకిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం
ముషీరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోకుండా ఎన్నికల నోటిఫికేషన్‌కు వెళ్లడం సిగ్గుచేటని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశాచారి, బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు, బీసీ జాక్ కో- కన్వీనర్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్ అన్నారు.
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు నారాయణగూడలోని వైఎంసిఏ చౌరస్తా వద్ద మంగళవారం ఏకపక్షంగా స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. 42శాతం అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధిని నీరుపించుకోకుండా ఎన్నికల నోటిఫికేషన్ వెళ్లడం సిగ్గుచేటన్నారు. బీసీ మంత్రులు బలహీనులుగా ఉండి, అగ్రకుల ముఖ్యమంత్రి, మంత్రులు ఉండటం వల్లే ఏకపక్షంగా రిజర్వేషన్లు తగ్గించి 22శాతంతో ఎన్నికలకు వెళుతున్నారని ఆరోపించారు.