calender_icon.png 26 November, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ సంఘాల రుణాలు మహిళలకు ఆర్థిక భరోసా

26-11-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు,నవంబరు25(విజయక్రాంతి):ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని,రుణాలను సద్వినియోగించుకొని మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు,గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్,మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి ములుగు నియోజకవర్గానికి చెందిన 9మండలాల స్వయం సహాయక సంఘాలకు రెండు కోట్ల 26లక్షల 76 వేల వడ్డీలేని రుణాల చెక్కును పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను ప్రారంభించి అంగరంగ వైభవంగా అమలు పరచడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రంలోని సగటు మహిళల ఆత్మ గౌరవంగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఒక గ్రూపు సభ్యులకు 20 లక్షల రూపాయల రుణాన్ని అందించి వారిని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని పేర్కొన్నారు.

సగటు మహిళ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిత్యవసరాలకు అధిక వడ్డీలతో అప్పులు తీసుకొని ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని వారందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మహిళలపై అత్యంత నమ్మకంతో ఎలాంటి తనకా లేకుండా వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం చాలా సంతోషకరమని తెలిపారు.