13-01-2026 12:00:00 AM
ములకలపల్లి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం గ్రామపంచాయతీలో సర్పంచి కుంజా వినోద్ సోమవారం హలో శుభోదయం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నర్సాపురం గ్రామం లో సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. దారి మధ్య పొలంలో కూలీ ల తో వరి నాట్లు వేస్తూ ప్రభుత్వ పథకాల గురించి వారికి వివరించారు. రాజాపురం గ్రామానికి చెందిన యూత్ సభ్యులకు వాలీబాల్ ఆట పరికరాలను అందజేశారు. వార్డు మెంబర్ పద్దం నాగరాజు, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పామర్తి కృష్ణ, మరీదు నాగు, మిడియం నారాయణ, బొడప్ప, కూరం రామకృష్ణ, రామాచారి, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు పాల్గొన్నారు.