08-11-2025 12:49:36 AM
కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, నవంబర్ 7(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ సమస్యపై కలెక్టర్ పి.ప్రావీణ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సంగారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా పాఠశాలల్లో శానిటేషన్ సమస్య, ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టం సరిగా అమలు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉండడంతో పాటు పాఠశాలలో శానిటేషన్ సమస్య కలెక్టర్ దృష్టికి రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సస్పెన్షన్ చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు. పాఠశాలలో శానిటేషన్ సిబ్బందిని తొలగించి నూతన సిబ్బందిని నియ మించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలన్నా రు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టం పూర్తిస్థాయిలో అమలు అ య్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణులు అయ్యేలా ఇప్పటి నుండే ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణా ళికతో ముందుకు వెళ్లాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.