09-02-2025 06:37:19 PM
బైంసా (విజయక్రాంతి): బైంసా మండలం సమీపంలో నిర్మల్ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. స్థానికులు కథనం మేరకు... కుబీర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన మల్లేష్ కుటుంబం కొంత కొంతకాలంగా వానల్పాడు గ్రామంలో కూలి పని చేసుకుని జీవిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అతని కుమారుడు అనిల్ (13) ఆదివారం ద్విచక్ర వాహనం తీసుకొని గ్రామం సమీపంలోకి వెళ్లాడు. అయితే రోడ్డు ప్రమాదంలో అనిల్ మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు తనకు తాను అదుపుతప్పి పడిపోయాడా లేదా ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీకొంద అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని బైంసా ప్రాంతియ ఆసుపత్రికి తరలించారు. బైంసా గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.