09-02-2025 06:33:08 PM
మందమర్రి (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్-నిజమాబాద్-అదిలాబాద్ పట్టబద్రుల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన తనను గెలిపించాలని కోరుతూ పెద్దపల్లి సత్యనారాయణ పట్టణంలో ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఆదివారం పట్టణంలోని మార్కెట్ ఏరియాలో పలువురు పట్టభద్రులని కలిసి మన ప్రాంతం నుండి ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నానని తనని ఆదరించి గెలిపించాలని కోరారు. ఉన్నత విద్యావంతులు, అనేక సామాజిక ఉద్యమాలు చేపట్టడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమానికి, వికలాంగుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న తనను ఆదరించి ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా పట్టభద్రులను కోరారు. ఆయన వెంట ప్రజాసంఘాల నాయకులు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్, బావండ్ల వీరస్వామి, వాసాల సంపత్ లు పాల్గొన్నారు.