విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి
తాండూరు, జూన్ 15,(విజయక్రాంతి) వి ద్యార్థులు చదువులో రాణిస్తూనే ఆరోగ్యం ప ట్ల శ్రద్ధ వహించాలని చేవెళ్ల పార్లమెంట్ స భ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన వికారాబాద్ జిల్లా యాలాల పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిన పడకుండా విద్యార్థునులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరిగిందని అన్నారు .
ఇంటి పరిసరాలు, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవని తెలిపారు. జే కే ఎం ఆర్ ట్రస్ట్ ద్వారా కొనసాగుతున్న స్వచ్ఛ మరుగుదొడ్లు కార్యక్రమంలో భాగంగా ఆయన మరుగుదొడ్లను శుభ్రం చేశారు. గత విద్యా సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణత శాతం ఎంత ఉందని ప్రధానోపాధ్యాయులు సిద్ధ రామేశ్వర్ తో అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులకు ఆట- పోటీల్లో సైతం శిక్షణలు ఇవ్వాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు.






