05-11-2025 12:20:03 AM
ఆలేరు, నవంబర్ 4 (విజయ క్రాంతి): - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డిని మంగళవారం రోజున టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ అలేర్ నుండి మంతపురి దారిలో ఉన్న రత్నాల వాగు పైన బ్రిడ్జి నిర్మించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పల్లె శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ ఆలేరు పట్టణ కేంద్రం నుండి మంతపూరికి వెళ్లే దారిలో వర్షం పడిన ప్రతిసారి వాగు ఉధృతంగా ప్రవహించడంతో బహదూర్ పేట, మంతపురి, దిలావర్పూర్, మోటకొండూర్, ఇక్కుర్తి, శర్బనాపురం, మాటూర్ గ్రామాలకు వెళ్లే ప్రజలు వర్షాలు పడిన ప్రతిసారి ఆలేరుకు రావడానికి విద్యార్థిని, విద్యార్థులు మరియు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డికు వివరించి, వినతిపత్రం అందజేశారు.