05-11-2025 12:18:53 AM
వలిగొండ, నవంబర్ 4 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయంలో మంగళ వారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తన కుమారుడు కుంభం శ్రీరామ్ రెడ్డి వివాహ పత్రికను స్వామి వారి వద్ద పెట్టి ఆశీస్సులను స్వీకరించారు. అనంతరం వలిగొండ మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో, గ్రామ శాఖ అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.