08-05-2025 12:17:28 AM
మహబూబ్ నగర్ మే 7 (విజయ క్రాంతి) : మంచి నైపుణ్యత ఉంటే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు అన్నారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీలో ఎంబీఏ విభాగంలో ద్వితీయ సంవత్సర సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్సర విద్యార్థులకు స్వాగతం మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిం చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలో సాఫ్ట్వేర్ కంపెనీలకు సీఈవోలుగా చేసిన వాళ్లందరూ ఎంబీఏ చేసిన వాళ్లే. కష్టపడి చదివి సాఫ్ట్వేర్ స్కిల్స్ పెంపొందించుకుంటే ఎంబీఏ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.
కోర్సు ప్రారంభంలోనే ఉన్నత విద్య చదవడానికి ఒక నిర్థిస్ట ప్రణాళికతో చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ జావేద్ ఖాన్, డాక్టర్ అర్జున్ కుమార్, డాక్టర్ నాగసుధ, డాక్టర్ అరుంధతి రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.