calender_icon.png 9 May, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

08-05-2025 12:16:31 AM

నాగారం, మే 7 : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు.బుధవారం నాగారం మండలం మామిడిపల్లి గ్రామంలో ఉపాధి హామీ నిధుల నుండి 20 లక్షల వ్యయంతో మంజూరైన నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను తీర్చడమే ప్రజా ప్రభుత్వ పాలన అని అన్నారు.

అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేకు పలు సమస్యలు విన్నవించు కోగా ప్రభుత్వ పాఠశాల ముందు ఉన్న ఎస్సారెస్పీ కాలువ చుట్టూ కంచె ఏర్పాటు చేస్తా అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ధాన్యాన్ని నిలువలను తరితెగతిన మిల్లులకు తరలించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డిఈఈ బాబూరావు,ఎంపిడిఓ మారయ్య,గిర్దావరి అల్లాద్దీన్, పంచాయతీ సెక్రటరీ వెంకటేష్ నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొడుసు లింగయ్య, బుచ్చిబాబు, కడియం పరమేష్, నరసింహా రెడ్డి, మొల్కపరి పుల్లయ్య, అశోక్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, సురేష్, ఉప్పాలయ్య, శ్రీకాంత్, నర్సయ్య, లింగయ్య, అవిలయ్య, సాయి, మహేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.