26-09-2025 12:45:51 AM
కేశవపట్నంలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాం తి): చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అందుకు తమ పిల్లల చదువుపై తల్లి దండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల రక్షణకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. గురువారం ఇచ్చోడ మండలం కేశవ పట్నం లో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డిఎస్పి జీవన్ రెడ్డి నేతృత్వంలో 160 మంది సిబ్బందితో వర్షంలో సైతం గ్రామంలో ఇం టింటా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనం తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నార్కోటిక్ డాగ్ రోమా సహాయంతో గంజా యికై తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మొదటగా అధికారులతో కలిసి గ్రామంలో తిరిగి విద్యార్థులకు చదువుపై ఉన్న ప్రాధాన్యతను తెలియజేశా రు. తల్లిదండ్రులు యువతకు చదువుకునేలా ప్రోత్సహించాలని, చదువు వలన భవిష్యత్తు, మంచి పేరు లభిస్తాయని సూచించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించవద్దన్నారు.
ఒకే గ్రామం నుండి గత ఐదు సంవత్సరాలలో 90 కేసు లు నమోదు అయ్యాయని, ఇక నుండి సన్మార్గంలో వెళ్లాలని సూచించారు. గ్రామంలో నమోదైన రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లను పరిశీలించడం జరుగుతుందని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనని వారిపై ఒక సంవత్సరం పాటు పరిశీలించి రౌడీ షీట్లను, సస్పెక్ట్ షీట్లను ఎత్తివేయడం జరుగుతుందని తెలిపారు. అక్రమంగా కలప రవాణాను, చెట్లను నరికి వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించు కునేలా ప్రతి ఒక్కరు సహకరించాలని, ము ఖ్యంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేస్తూ వాటి ఏర్పాటకు కృషి చేయాలని తెలిపారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, ఎలాంటి గృహహింస చర్యలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. గం జాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్త్స్రలు విష్ణువర్ధన్, సాయన్న, శ్రీకాంత్, ఇమ్రాన్, రాధిక, పూజ, స్పెషల్ బ్రాంచ్ ఎస్త్స్ర అన్వర్ ఉల్ హక్, సిబ్బంది పాల్గొన్నారు.