calender_icon.png 26 September, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండోర్ స్టేడియంలో అన్ని రకాల సదుపాయాలను కల్పించాలి

26-09-2025 12:45:48 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి ) : జిల్లా కేంద్రంలో ప్రజల ఆరోగ్యం కోసం అందుబాటులోకి తెస్తున్న ఇండోర్ స్టేడియాన్ని ప్రజలు సద్వినియోగించుకునేలా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తి పట్టణంలో జిల్లా కలెక్టర్ నిధులతో ఇండోర్ స్టేడియంలో చేస్తున్న పునరుద్దరణ పనులను గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా స్టేడియంలో నూతన బ్యాడ్మింటన్ కోర్ట్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, జిమ్ గదుల్లో కల్పించిన సదుపాయాలను పరిశీలించి, ప్రజల వినియోగానికి అవసరమైన ఏర్పాట్లపై జిల్లా క్రీడల యువజన అధికారి, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ కు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్థవంతంగా స్టేడియాన్ని ఉపయోగించుకునేలా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు.

ఇండోర్ స్టేడియం పునరు ద్ధరణ పనులు పూర్తయిన వెంటనే ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. ఇండోర్ స్టేడియం లో అందరినీ ఆకట్టుకునే విధంగా భారత క్రీడాకారుల చిత్రాలు ఆటలకు సంబంధించిన చిత్రాలను పెయింటింగ్ వేయించాలన్నారు. డివైఎస్వో సుధీర్ రెడ్డి, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.