13-09-2025 05:12:11 PM
మంచిర్యాల, (విజయక్రాంతి): ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కాంస్య విగ్రహాన్ని మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak)కి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళా సమితి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సిరికొండ బోస్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ లో ఆయన వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని విన్నవించినట్లు తెలిపారు.