calender_icon.png 1 February, 2026 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల బడ్జెట్ 25వేల కోట్లు కేటాయించాలి

01-02-2026 12:11:58 AM

ముషీరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): వచ్చే ఆర్థిక సంవత్సరం బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి బీసీల బడ్జెట్ రూ. 25వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం విద్యా నగర్ లోని బీసీ భవన్ లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీ ఆర్. కృష్ణ య్య ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో యేటా 25 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు, కానీ ఇంతవరకు 10వేల కోట్లకు మించి కేటాయించ లేదన్నారు. ఖర్చు పెట్టడం లేదన్నారు. గత రెండు సంవత్సరా లుగా బీసీ సంక్షేమ అభివృద్ధి కుంటు పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పథకాలు లేవు, ఫీజు లు, స్కాలర్షిప్లు చెల్లించడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడం లేదన్నారు.

ఒక హాస్టల్ బిల్డింగ్ కానీ, గురుకుల పాఠశాల బిల్లులు గాని కట్టలేదన్నారు. చివరకు ఒక పైసా ఖర్చు లేని స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42 శాతంకు పెంచుతామని వాగ్దానం చేసి పెంచలేదన్నారు. బీసీ వ్యతిరేకం చర్యలకు పాల్పడుతున్నారన్నారు. పేరుకే బీసీ సంక్షేమ శాఖ కాని, ఒక బీసీ ఉన్నత అధికారిని కమిషనర్, సెక్రెటరీ బీసీని నియమించలేదన్నారు. బీసీలను విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో అణచివేస్తున్నారని ద్వజమెత్తారు.

ఈ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో 290 కాలేజీ హాస్టళ్ళు కొనసాగుతున్నాయని, అన్ని కాలేజీ హాస్టళ్ళు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. అద్దె భవనాలకు ఏటా కోట్ల రూపాయల అద్దెలు చెల్లిస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం 80 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం మ్యాచింగ్ గ్రాంటు క్రింద దశలవారీగా సొంత భవనాలు నిర్మించడానికి ఈ బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలని విజ్ఞ ప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు, నీల వెంకటేష్, పగిళ్ళ సతీష్, జి. అనంతయ్య, రాజేందర్, అనురాధ గౌడ్, జి. పద్మ, వేణుమాధవ్, కిషోర్ యాదవ్ తదితరులు సంఘ నాయకులు పాల్గొన్నారు.