05-10-2025 12:04:35 AM
ఇప్పటి వరకు అక్కాచెల్లెళ్లకు చీరెలు.. ఆడబిడ్డలకు కానుకలు.. తల్లిదండ్రులకు దీవెన వంటి సెంటిమెంట్లు పండించే వేడుకలు చూశాం.. తాజాగా తెలంగాణ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో మహిళలు గాజుల పండుగ నిర్వహిస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజాంబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, మెదక్ తదితర ప్రాంతాల్లో గత నెల రోజుల నుంచి మహిళలు కొత్త సెంటిమెంట్లు పండిస్తూ గాజుల సంబురం జరుపుకుంటున్నారు.
గ్రూపులుగా ఏర్పడి..
తెలంగాణ ప్రాంతంలో మహిళలు గాజుల పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నా రు. గాజులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయా గ్రామాల్లో మహిళలు ఆడపిల్లలు విద్యార్థులు, మహిళా ఉద్యోగులు తమ ఊర్లు, కాలనీల్లో గ్రూపులుగా ఏర్పడి గాజుల పండుగ నిర్వహిస్తున్నారు. పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలందరూ ఒకే చోట గ్రూ పుగా ఏర్పడి చేతులకు రంగురంగుల మెహం దీ డిజైన్లను వేసుకొని ముఖంపై పసుపు రాసుకుంటూ నుదుటికి బొట్టుపెట్టి వారి ఆర్థిక స్తో మతను బట్టి 11 నుంచి 51 గాజులను ఒకరికొకరు తొడిగించుకుని సంబరాలు జరుపుకుం టున్నారు.
గాజుల తొడిగింపు అనంతరం స్వీ ట్లు తినిపించుకుని గాజుల చప్పుడు చేస్తూ నృత్యాలు పాటలు పాడి ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే మహిళలు పరస్పరం బట్టలు పెట్టుకుని వేడుకలను ఉపయోగంగా నిర్వహించుకునేందుకు ఫొటోలు షూటింగ్ వీడియోగ్రఫీ చేయించుకుంటూ ఈ వేడుకలను నిర్వహించుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ గాజుల పం డుగ ప్రజల్లో ఐక్యత ప్రేమానురాగం పెంపొందించడానికి దోహద పడతాయని వారు పే ర్కొంటున్నారు. ఈ పండుగకు ఆయా గ్రామా ల్లో తమ పుట్టింటికి బిడ్డలను రప్పించుకుని గాజులు వేసుకొని కట్న కానుకలను సమర్పించుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఈ గాజుల పండుగ పెద్ద ఎత్తున నిర్వహిస్తుండడం తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా యి.
చిన్నపిల్లలు సైతం ఈ గాజుల పండుగలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భోజనాలను తయారు చేసుకొని వంటావార్పుతో ఈ వేడుకలను కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతా ల్లోనే కాకుండా విద్యాసంసలు,్ల అపార్ట్‌మెంట్‌లలో ఈ వేడుకలను నిర్వహించుకుంటు న్నారు.
నిర్మల్, విజయ క్రాంతి
పండుగలతోనే ఐక్యత
తెలంగాణ ప్రాంతం అంటేనే సంస్కృతి సంప్రదాయానికి పెట్టింది పేరు. తెలంగాణలో గాజుల పండుగ ప్రతి గ్రామంలో మహిళలు నిర్వహించుకోవడం వల్ల వారిలో ఐక్యత ప్రేమానురాగం పెరిగి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండేందుకు ఇవి దోహదపడతాయి. మహిళ లకు గాజులతో ఉన్న అనుబంధం ఎంతో పవిత్రమైంది. అటువంటి గాజుల పండుగను జిల్లాలో నిర్వహించుకోవడం కొత్త ఒరవడికి శ్రీకర చుట్టినట్టుంది.
కడారి గంగామణి నిర్మల్
ముహూర్తాలు చూసుకుంటున్నారు
తెలంగాణ ప్రాంతాల్లో గాజుల పండుగ నిర్వహించుకోవడానికి కొందరు మహిళలు ముహూర్తాలను కూడా చూసుకుంటున్నారు. ఈ పండుగలో గాజులు వేసుకోవడం ముఖానికి పసుపు రాసుకోవడం చేతులకు మెహందీ పెట్టుకోవడం ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలిగిస్తాయి ఇటువంటి పండుగలను మహిళలు నిర్వహించుకోవడం శుభపరిణామం.
రాజు పూజారి ఓలా