16-09-2025 12:00:00 AM
మనోహరాబాద్, సెప్టెంబర్ 15 :మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ పట్టణ పరిధిలో శ్రీరామ స్పిన్నింగ్ మిల్లులో ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన గానుగు రవికి శ్రీరామ స్పిన్నింగ్ కంపెనీ యాజమాన్యంతో తూప్రాన్ సీఐ, మనోహరాబాద్ ఎస్‌ఐ, కాళ్లకల్ గ్రామ సంఘ పెద్దలు కలసి మాట్లాడారు. వీరి చొరవతో యాజమాన్యాన్ని ఒప్పించి బాధిత కుటుంబానికి రూ.8 లక్షలు పరిహారం అందేలా చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి సుబ్బారావు, బిజెపి నేత, మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్, గానుగు సురేష్, సతీశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.