16-09-2025 12:00:00 AM
పోలీస్ ప్రజావాణిలో 23 ఫిర్యాదులను స్వీకరించిన సి.పి. సాయి చైతన్య
నిజామాబాద్ సెప్టెంబర్:15 (విజయ క్రాంతి): ఈ రోజు నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్., గారు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ ఏర్పాటుచేసిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమం ప్రజాదరణ పొందుతోంది. సంవత్సరాల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలపై ఫిర్యాదుదారులు ఇచ్చే దరఖాస్తులపై వెంటనే స్పందిస్తున్నా సిపి సాయి చైతన్య పనితీరుపై జిల్లా ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 23 ఫిర్యాదులను బాధితుల నుండి స్వీకరిం చారు. బాధితుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబం దిత అధికారులకు పలు సూచనలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యనువ్వు వివరించి పరిష్కరిం చవలసిందిగా సిపి సూచించారు.
సమస్యల పట్ల ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా మీరు కూడా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్వచ్చం దంగా పోలీసు సేవల్ని వినియోగించు కుంటూ, వారి వారి సమస్యలను చట్ట ప్రకా రం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని సి.పి.సాయి చైతన్య,స్పష్టం చేశారు.