calender_icon.png 23 September, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వైద్యుడి నిర్వాకానికి చిన్నారి బలి

23-09-2025 01:38:09 AM

అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహణ 

మేడ్చల్, మేడిపల్లి,సెప్టెంబర్ 22(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో నకిలీ వైద్యుడు నిర్వాకానికి ఒక చిన్నారి బలి అయింది. బో డుప్పల్ , దేవేందర్ నగర్ ప్రాంతానికి చెంది న కొండరాజు, లావణ్య దంపతులు తమ కూతురు హాసిని (7) కి వారం రోజులుగా జ్వరం రావడంతో  సమీపంలోని సత్య పాలీ క్లినిక్ కు తీసుకెళ్లారు. అందులో వైద్యుడిగా చలామణి అవుతున్న సిహెచ్. బాల సిద్ధులు మొదట  కొన్ని మందులు రాసిచ్చాడు.

జ్వ రం తగ్గకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీ ణించింది. దీంతో ఆదివారం చిన్నారిని క్లినిక్ కు తీసుకెళ్లారు. తాత్కాలికంగా ఎంటరిక్ ఫీవ ర్, వైరల్ హైపటైటిస్(టైఫాయిడ్ తో జాం డీస్) అని నిర్ధారించి చికిత్స మొదలుపెట్టా రు.

చికిత్స సమయంలో చిన్నారికి రక్త వాం తులు వచ్చాయి. చిన్నారి పరిస్థితి విషమం గా తయారైంది. అయినప్పటికీ పెద్ద ఆసుపత్రికి పంపలేదు. పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తే ఎక్కు వ ఖర్చవుతుందని తల్లిదండ్రులను భయపెట్టి తప్పుదోవ పట్టించాడు. పరిస్థితి మరిం త విషమించి సాయంత్రం చిన్నారి మృతి చెందింది. 

ఆస్పత్రి సీజ్ చేసిన వైద్యాధికారులు 

చిన్నారికి వైద్యం చేసిన బాల సిద్ధులకు ఎలాంటి అర్హత లేదు. కానీ కొంతకాలంగా వైద్యం చేస్తూనే ఉన్నాడు. బాల సిద్ధులు నిర్వాకం వల్ల చిన్నారి హాసిని మరణించిన విషయం తెలిసిన తర్వాత వైద్యాధికారులు ఆసుపత్రిని తనిఖీ చేశారు. సత్య పాలీ క్లినిక్ రిజిస్టర్ కాలేదని, అందులో పీడియాట్రిక్ లేదా క్రిటికల్ కేర్ సదుపాయాలు లేవని, అ లాగే అక్కడ పనిచేసిన వ్యక్తి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో నమోదు కాలేదని తేలింది.

క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కూడా అనుమతి లేదు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంట ర్ ఇన్చార్జి డాక్టర్ ప్రణీత్, డిప్యూటీ జిల్లా ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ వసంత రెడ్డి క్లినిక్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సి ఉమా గౌరీ మాట్లాడు తూ ప్రభుత్వ ఆరోగ్య సేవలు జిల్లా వ్యాప్తం గా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ప్రజలు నకిలీ వైద్యులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు రా వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 112 బస్తీ దవఖానా లు, 73 పల్లె దవఖానాలు, అదనంగా ఏరి యా ఆసుపత్రులు, జిల్లా ఆస్పత్రులు, క మ్యూనిటీ హెల్త్ సెంటర్లు వైద్యం అందిస్తున్నాయన్నారు.