23-09-2025 01:39:45 AM
మేడిపల్లి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సీనియర్ల వేధింపులు తాళలేక ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా నారాపల్లిలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయితేజ నారపల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువు తున్నాడు. సాయితేజకు సీనియర్లు బలవంతంగా మద్యం తాగించడంతోపాటు బార్‌కు తీసుకెళ్లి మద్యం తాగారు.
అనంతరం రూ.10 వే ల బిల్లు కట్టాలని జాదవ్‌పై ఒత్తిడి చేశారు. సీనియ ర్ల వేధింపులు తట్టుకోలేక నా రాపల్లిలోని మధు బాయ్స్ హాస్టల్‌లో ఉన్న తన రూ మ్‌లో సాయితేజ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్లు ర్యాగింగ్ చేయడం వల్లే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని తోటి స్నేహితులు తెలిపారు.